తల్లి , తండ్రి విడాకుల కేసులో కూతురు తల్లి తోనే ఉంటానని తండ్రితో తనకు సంబంధం లేదని కోర్టుకు చెబితే తండ్రి నుంచి తన చదువుకు , పెళ్ళికి డబ్బులు ఎలా ఆశిస్తుంది అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది .. ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తలకు విడాకులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల విడాకులు ముందు , తాను తల్లితోనే ఉంటానని , తండ్రి వద్దని చెప్పి , ఆయననుంచి డబ్బులెలా ఆశిస్తావు ..? అని నిలదీసింది. 20 ఏళ్ల కూతురు తన తండ్రి నుంచి తనకు , చదువుకి , పెళ్లి కి డబ్బులు కావాలని పిటిషన్ వేసింది .
ఈ పిటిషన్ను విచారించిన కోర్టు తండ్రితో సంబంధాలు తెంచుకున్న కూతురు , తల్లితోనే ఉంటానని చెప్పి ఇప్పుడు తండ్రి నుంచి డబ్బులు ఆశించడం ఎంతవరకు న్యాయం అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అందువల్ల తల్లిదండ్రి విడాకుల తర్వాత కూతురు , తండ్రితో సంబంధాలు వద్దని అంటే , డబ్బులు కోరే హక్కు అధికారం లేదని స్పష్టం చేసింది . తల్లికి శాశ్వత భరణం కింద ఇచ్చిన 10 లక్షల రూపాయల డబ్బులో , తల్లి , కూతురు ఇద్దరూ అనుభవించాలని చెప్పింది. అలా కాకుండా కూతురు తండ్రి తో కూడా సంబంధాలు కొనసాగిస్తానంటే తాము ఈ కేసు విషయంలో పునరాలోచన చేయాలని స్పష్టం చేసింది .
కూతురు కూడా తనకు తనకు తండ్రితో సంబంధం లేదని విడిగా పోతున్నప్పుడు ఆమె చదువు కానీ పెళ్లి కాని ఇతరత్రా అవసరాలకు మించి డబ్బు ఆశించకూడదు చేసింది. ఈ విషయంలో మళ్లీ కూతురు తండ్రి తో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తానని చెబితే అప్పుడు ఆలోచించాలని చెప్పింది. కూతురు అవసరాన్ని గుర్తించి ఆర్థిక సహాయం చేయాలనుకుంటే అది తండ్రి విచక్షణ వదిలేస్తున్నామని చెప్పింది. అయితే ఈ విషయంలో ఖచ్చితమైన తీర్పును తాము చెప్పడం లేదని కూతురు కూతురు విషయం తండ్రికి వదిలేస్తున్నామని తెలిపింది.. కూతురు మాత్రం తల్లితోనే ఉంటే , తండ్రిని వద్దనుకుంటే , డబ్బులు కూడా అడగకూడదని చెప్పింది..