యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పెయిన్ కి వెళ్ళారు. ఇటీవలే ఆయన నటించిన రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మిక్సడ్ రివ్యూస్ వచ్చిన ఈ సినిమాకి కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రస్తుతం సలార్, స్పిరిట్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇదిలావుంటే ప్రభాస్ ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నాడు. ఏ సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. చిన్న సర్జరీ కోసం స్పెయిన్ వెళ్ళినట్లు తెలిసింది. సలార్ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన స్పెయిన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
చిన్నపాటి సర్జరీ కూడా చేసినట్లు తెలిసింది. కొన్నిరోజుల పాటు విశ్రాంత్రి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో ప్రభాస్ కొంతకాలం అక్కడే గడపనున్నారు. తమ ఫేవరేట్ హీరోకి సర్జరీ జరగడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.