అసలే కానిస్టేబుల్ ,మందుకొట్టాడు.. చెప్పుదెబ్బలు తిన్నాడు..

    0
    252

    తాగిన మైకంలో తన భర్త పైన బిడ్డ పైన అఘాయిత్యానికి పాల్పడ్డ కానిస్టేబుల్ ను మహిళ చెప్పు తీసుకుని కొట్టింది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఓ మహిళ భర్త చిన్న బిడ్డతో కలిసి రైల్ ఎక్కేందుకు పోతుండగా మధ్యలో తగిన మైకంలో ఉన్న కానిస్టేబుల్ కారణంగా ఆమె భర్తను ఆపి కొట్టాడు. ఎందుకు కొట్టావని అడిగితే , చిన్న బిడ్డను కూడా కొట్టేందుకు లాఠీ ఎత్తాడు. ఇదంతా చూస్తున్న ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోయి, వెంటనే తన కాలి చెప్పు తీసుకుని కానిస్టేబుల్ను ఎడాపెడా వాయించేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న మరో మహిళా కానిస్టేబుల్ వచ్చి తాగుబోతు కానిస్టేబుల్ వారించింది . నువ్వు తప్పు చేసావు అంటూ కానిస్టేబుల్ ని మందలించింది. తాగుబోతు కానిస్టేబుల్ , ఆ మహిళా కానిస్టేబుల్ ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ కూడా లాఠీ తీసుకొని దగ్గరికి వస్తే కోడతానని హెచ్చరించింది. ఈ మొత్తం వీడియో ఇప్పుడు ట్రెండ్ గా మారి, సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తోంది..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..