చేపల కూరలో స్లోపాయిజన్ పెట్టిన అల్లుడు..

  0
  589

  భార్య‌తో స‌హా అత్త‌మామ‌లు, మ‌ర‌ద‌లు మొత్తం అత్తింటివారిని అంతం చేయాల‌ని ఓ భ‌ర్త మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. ఈ దారుణంలో అత్త, మ‌ర‌ద‌లు చ‌నిపోగా.. భార్య తీవ్ర అనారోగ్యంతో ఉంది. మామ మాత్రం ప్రాణాల‌తో బైట‌ప‌డ్డారు. ఇరాక్ మాజీ అధ్య‌క్షుడు స‌ద్దాం హుస్సేన్ స్ఫూర్తితో ఈ మాస్ట‌ర్ ప్లాన్ వేశాన‌ని పోలీసుల‌కు చిక్కిన నిందితుడు చెప్పాడు. డిల్లీకి చెందిన వ‌రుణ్ అరోరా అనే నీచుడు చేప‌ల కూర‌లో థాలియం అనే ఒక ప్ర‌మాద‌కర విషాన్ని చేప‌ల కూర‌లో క‌లిపి అత్తింటి వారికి పెట్టాడు. నాలుగు రోజుల త‌ర్వాత తీవ్ర‌మైన అనారోగ్యంతో అత్తా మ‌ర‌ద‌లు చ‌నిపోయారు. వ‌రుణ్‌ భార్య కూడా ఆస్ప‌త్రిలో చేరింది.

  ఆస్ప‌త్రిలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో భార్య ర‌క్తంలో ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నం వుంద‌ని వెల్ల‌డైంది. దానిపై మెడిక‌ల్ ల్యాబ్ లో ప‌రిశోధ‌న జ‌రిపితే అది థాలియం అనే స్లో పాయిజ‌న్ అని నిర్ధార‌ణ అయింది‌. దాంతో అంత‌కుముందు చ‌నిపోయిన అత్తా మ‌ర‌ద‌ల వైద్య నివేదిక‌ను ప‌రిశీలించి, వారి శ‌వాల‌కు కూడా మ‌ళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వ‌హించారు. వారి మ‌ర‌ణానికి కార‌ణం కూడా థాలియం ర‌సాయ‌నం అని తేలింది. ఈ థాలియం ర‌సాయ‌నం ప్ర‌భావం వ‌ల్ల మూడు రోజుల్లో వెంట్రుక‌లు రాలిపోవ‌డం, అరికాళ్ళ‌ల్లో మంట‌లు రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

  మామ మోహ‌న్ శ‌ర్మ‌కు కూడా అలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపించినా ఆయ‌న స‌రైన స‌మ‌యంలో వైద్యం తీసుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ ఇంటి ప‌నిమ‌నిషికి కూడా ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపించాయి. దీంతో పోలీసులు ఒక ప‌ధ‌కం ప్ర‌కారం వీరిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. చేప‌ల కూర తిన్న త‌ర్వాత నుంచి ఇలాంటివ‌న్నీ జ‌రిగాయ‌ని పోలీసుల‌కు చెప్ప‌డంతో, స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపిన పోలీసులు వ‌ర‌ణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో తాను నేరం చేశాన‌ని ఒప్పుకున్నాడు. అత్తింటివారు త‌న‌ను చాలాకాలం నుంచి వేధిస్తున్నార‌ని, ప‌గ తీర్చుకునేందుకే స్లో పాయిజ‌న్ ఇచ్చాన‌ని చెప్పాడు. స‌ద్దాం హుస్సేన్ కూడా ఇలాగే రాజ‌కీయ శత్రువుల‌ను అంతం చేసేందుకు ఆహారంలో క‌లిపేవాడ‌ని, తాను కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నాన‌ని పోలీసుల ముందు చెప్పాడు.

   

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..