బరువు తగ్గే మాత్ర – ఇది వాడితే పరలోక యాత్రే.

  0
  327

  బరువు తగ్గాలనుకుంటున్నారా .? అయితే ఈ పిల్స్ వాడండి అంటూ చాలా మందుల కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. గత కొన్నేళ్లుగా నిశ్శబ్దంగా జరిగిన మారణహోమం గురించి తెలిస్తే , బరువు తగ్గే పిల్స్ ఇక వాడనే వాడరు. ఫ్రాన్స్ లో రెండేళ్ల కోర్టు విచారణ తర్వాత మీడియేటర్ అనే మాత్రను బరువు తగ్గేందుకు వాడిన 2 వేలమంది , దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ తో చనిపోయారని నిర్థారించారు. దీనిపై గత రెండేళ్లుగా ఫ్రాన్స్ లో నలుగురు జడ్జీలు ఆధ్వర్యంలో కేసు నడిచింది.

  మందుల కంపెనీ తరపున , చనిపోయిన వారి బంధువుల తరపున , కేసులు నమోదుచేసిన పరిశోధన సంస్థ తరపున , మొత్తం 400 మంది లాయర్లు ఈ కేసులు వాదించారు. చివరకు బరువు తగ్గేందుకు వాడిన మీడియేటర్ అనే మాత్రలవల్లనే 2 వేలమందికి గుండెకు సంబందించిన సమస్యలు వచ్చి చనిపోయారని రుజువుచేశారు. దీంతో కంపెనీ ఛైర్మెన్ , ఎండిలకు 4 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. 30 వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టులు ఆదేశించాయి. తెలియకుండా చేసిన నేరం కాబట్టి , శిక్ష తగ్గించామని , లేదంటే ఇది చచ్చేవరకు జైల్లో ఉంచాల్సిన నేరమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మొదట్లో షుగర్ వ్యాధి తగ్గించేందుకు వాడే , ఈ మాత్రను , మార్పులుచేసి , బరువు తగ్గేందుకని ప్రచారంచేసి ఈ ఘోరానికి కారణమయ్యారు..

   

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..