ఒక పెళ్లికూతురుకి , ఐదుగురు పెళ్లికొడుకులు..

  0
  1168

  వామ్మో ..ఆ అమ్మాయి దేశముదురు.. సినిమాల్లోకూడా చూపించలేనంత సినిమా చూపించింది . ఒకే దఫా ఐదుగురు అబ్బాయిలకి. పాపం అబ్బాయిలంతా అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయి వచ్చేశారు.. అమ్మాయేమో పరార్ . విచారిస్తే ఆ దొంగ పెళ్లికూతురు ఐదుగురు దగ్గర డబ్బులు గుంజేసి , వాళ్ళను వాజమ్మలు చేసి పోయింది. మధ్యప్రదేశ్ లోని హర్దాలో అబ్బాయి , బంధుమిత్రసమేతంగా పెళ్లి మండపానికి వచ్చేశాడు. ఎంతకీ పెళ్లికూతురు రాలేదు , ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. డబ్బులు గుంజేసి అమ్మాయి తమకు టోకరా ఇచ్చిందని తెలిసి , పెళ్ళికొడుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. అదే టైం కి , ఇలాంటి అభాగ్య పెళ్లికొడుకులు మరో నలుగురు అక్కడే ఉన్నారు. వీళ్లందరినీ మోసంచేసింది ఒకే అమ్మాయి కావడమే విచిత్రం. అందరి దగ్గరా పెళ్ళిఖర్చుల పేరుతొ డబ్బు గుంజేసింది. ఇదే గ్యాంగ్ వారం క్రితం భోపాల్ జిల్లాలోకూడా ముగ్గురిని ఇలాగే పెళ్లిపేరుతో మోసంచేసి డబ్బులు గుంజేసి పారిపోయింది. పెళ్లికాని అబ్బాయిలు , ఎవరో ఒకరని తొందరపడి , ఎదురుడబ్బులిచ్చి పెళ్ళికి సిద్ధపడితే ఇలాగే ఉంటుందని పోలీసు అధికారి భూపేంద్ర సింగ్ చెప్పారు. అందువల్ల పెళ్ళికో ముందు అబ్బాయిలు జాగ్రత్తపడాలని కోరారు..

   

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..