బాబాయ్ మైండ్ బ్లోయింగ్.. చరణ్ కితాబు..

  0
  85

  వకీల్ సాబ్ ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందించారు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టింగ్ పెట్టారు. ఆల్వేస్ పవర్ ఫుల్ అంటూ.. పవర్ స్టార్ గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇంటి వద్దకు వచ్చిన అభిమానులకు ఇటీవల వకీల్ సాబ్ ట్రైలర్ గురించి చెప్పారు చరణ్. అందిరికంటే ముందు ఆ ట్రైలర్ తానే పోస్ట్ చేస్తానని, చాలా ఎగ్జయిటింగ్ గా ఉందని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ రిలీజయిన తర్వాత పవర్ స్టార్ అభిమానిలాగే చరణ్ మైండ్ బ్లోయింగ్ అంటూ స్పందించాడు.

  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న చరణ్, చిరంజీవి ఆచార్య మూవీలో కూడా ఓ గెస్ట్ రోల్ చేశాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య నుంచి చరణ్ ఫొటోలు విడుదలయ్యాయి.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?