విమానం ఇంజిన్ తో బైక్..నడిపే దమ్ము మీకుందా..?

  0
  925

  సాధారణ బైక్ లు నడిపేవారి చేతికి ఒక్కసారిగా డ్యూక్ బైక్ చేతిలో పెడితే దాని ఇంజిన్ కెపాసిటీ తట్టుకోలేరు. 100 సీసీ బైక్ లు నడిపేవారు 250 సీసీ బైక్ నడిపితే దాని స్పీడ్ ని తట్టుకోవడం కాస్త కష్టమే. అలాంటిది 2500 సీసీ బైక్ ని చేతిలో పెడితే ఎవరైనా ఏం చేస్తారు. ఫస్ట్ గేర్ ని తట్టుకోవడమే అసాధ్యం. అవును 2500 సీసీ బైక్ ఇప్పుడు మార్కెట్ లో ఉంది. దాన్ని నడిపే దమ్ము మాత్రం అతి కొద్ది మందికే ఉంది.

  టీఎంసీ డ్యుమాంట్. విమానం ఇంజిన్ తో నడిచే బైక్ ఇది. ఏకంగా 300 హార్స్ పవర్ సామర్థ్యం దీనిసొంతం. విమానం ఇంజిన్ కాబట్టి ఆమాత్రం స్పీడ్ ఉంటుందిలెండి. ఫార్ములా 1 రేస్ డ్రైవర్ టార్సో ఈ బైక్ ని తయారు చేశాడు. హబ్లెస్ వీల్స్ దీనికి అదనపు ఆకర్షణ. స్పోక్ లెస్ వీల్స్ అసలీబైక్ ఎలా నడుస్తుందా అని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 1960లో తయారు చేసిన సిక్స్ సిలిండర్ రోల్స్ రాయిస్ కాంటినెంటల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తో దీన్ని తయారు చేశారు.

  మూడేళ్ల క్రితం డైటోనా బైక్ వీక్ లో తొలిసారిగా దీన్ని రోడ్ పైకి తెచ్చారు. రోజువారీ వాడకానికి మాత్రం ఈ బైక్ ని బయటకు తేవడం కుదరదు. దీన్ని ఓ ఛాలెంజింగ్ గా తీసుకునేవారే బయటకు తేగలరు. ప్రస్తుతానికి ఈ బైక్ ని నడిపేందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నా.. అది ఎక్కి దిగాక మాత్రం దాని జోలికి రెండోసారి వెళ్లడానికి వెనకడుగేస్తున్నారు. అదీ దీని రేంజ్.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?