శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. సినిమా అవకాశాలకోసం వచ్చే యువతులతో వ్యభిచారం చేయించే నీఛులు కొంతమందిని చూసుంటాం కానీ, అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఇంత దారుణంగా వ్యవహరిస్తూ దొరికిపోవడం మాత్రం ఇదే తొలిసారి. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సినిమా అవకాశాలకోసం వచ్చే యువతులను ట్రాప్ చేసి వారితో న్యూడ్, సెమీ న్యూడ్ సినిమాలు తీయడం, వాటిని యాప్ ల ద్వారా ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడనే కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో కలకరం రేగింది..
రాజ్ కుంద్రాకు ఇదేం పాడుబుద్ధి..
రాజ్ కుంద్రా వేలకోట్ల ఆస్తి పరుడు. ఆయన పూర్వీకుల సొంత ఊరు లూథియానా. తండ్రి కండక్టర్, తల్లి చిన్న షాపులో పనిచేసేవారు. తర్వాత దుబాయ్ కి వెళ్లి శాలువాల వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు. కన్స్ట్రక్షన్ బిజినెస్ తో రాజ్ కుంద్రా బాగా ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు, లైవ్ బ్రాడ్ కాస్టింగ్ వ్యాపారం, క్రీడా వ్యాపారంలో కూడా రాణించాడు. ఐపీఎల్ భాగస్వామి కూడా.
దుబాయ్ బేస్డ్ బిజినెస్ మేన్ గా బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ హిందీ ఇండస్ట్రీతో పరిచయం పెంచుకున్నాడు. తన మొదటి భార్య కవితకు విడాకులిచ్చాడు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి పరిచయమైంది. ఆమెతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్నాడు.
వేలకోట్ల వ్యాపారానికి అధినేత అయిన రాజ్ కుంద్రాకు ఇలా పోర్న్ సినిమాల పాడుబుద్ధి ఏంటనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. అన్నిరకాల బిజినెస్ లు ఉన్నా కూడా ఇలా నీఛంగా పోర్న్ సినిమాలతో సంపాదిస్తాడని తెలుసుకుని చాలామంది షాకయ్యారు. ఈ వ్యవహారమంతా శిల్పా శెట్టికి తెలియకుండా జరుగుతుందంటే ఎవరూ నమ్మరు. ఈ క్రమంలో శిల్పా శెట్టిపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?