తాగుబోతు కిమాయి మళ్లీ అరెస్ట్ అయింది..

    0
    1659

    అమెరికాలో ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ పై దౌర్జన్యం చేసిన కేసులో అరెస్ట్ అయి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి నకేసులో హర్మా కిమాయి అనే మహిళను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఉబెర్ ట్యాక్సీలో పోతుండగా శుభాకర్ కర్కే అనే డ్రైవర్ ఆమెను మాస్క్ పెట్టుకోమని చెప్పాడు. దీంతో నేను మాస్క్ పెట్టుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ డ్రైవర్ తో వాదనకు దిగింది. మాస్క్ పెట్టుకోకపోతే తాను కారు నిలిపివేసి దింపేస్తానని, పోలీసులకు సమాచారం ఇస్తానని చెప్పాడు డ్రైవర్. దీంతో కిమాయి డ్రైవర్ పై దౌర్జన్యం చేసి అతడ్ని కొట్టి, అతడి మాస్క్ తీసేసి, ఫోన్ తీసేసుకుని, అతడిపై దగ్గుతూ ఉమ్మింది. ఆమె స్నేహితులిద్దరూ అతడిపై పెప్పర్ స్ప్రే చల్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ కావడంతో పోలీసులు ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి 50లక్షల రూపాయల బాండ్ మీద విడుదల చేశారు. ఇంత గందరగోళం చేసి వార్తల్లోకెక్కిన కిమాయి మళ్లీ అరెస్ట్ అయింది. తాను జైలులో ఉండగా ఒక ఖైదీతో ప్రేమలో పడ్డానంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి గందరగోళం సృష్టించింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలో తాగి ఒక బార్ ముందు గందరగోళం సృష్టించి దారినపోయేవారిని కొడుతూ, వారిపై ఊస్తూ బీభత్సం సృష్టించింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిని తరుముకుని కొట్టబోయింది. పోలీసులు ఆమె పెడరెక్కలు విరిచికట్టి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లారు. మంచి చేసి ప్రపంచ వార్తలకు ఎక్కేవారు కొందరయితే, ఇలాంటి నీఛమైన పనులు చేసి మూడు నెలల్లోనే ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ అయ్యేవారు కూడా ఉంటారు. మొదట ఆమె ఉబెర్ డ్రైవర్ పై చేసిన దౌర్జన్యం, ఆ తర్వాత పోలీసులనుంచి తాగిన మైకంలో తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న వీడియోలు చూడండి.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?