ఇప్పుడు పెళ్ళి అంటే , సంగీత్ కార్యక్రమం ఉంది తీరాల్సిందే.. గతంలో ఉత్తరభారతదేశంలోనే ఉన్న ఈ ఆచారం ఇప్పుడు మనకూ వచ్చేసింది.. మొదట్లో డబ్బున్న కుటుంబాలలోనే ఇది జరిగేది.. ఇప్పుడీ మధ్యతరగతి పెళ్లిలలోనూ ఇదో కార్యక్రమం అయిపొయింది.. ఈ పెళ్ళిలో పెళ్ళికొడుకు వదిన చేసిన డాన్స్ అదిరింది. మరిది , పెళ్లికూతురు సిగ్గుతో వదినతో చేతులు కలపగా , వదిన మాత్రం స్టేజి అదిరేట్టు హమ్ ఆప్‌కే హైకోన్’ సినిమాలోని ‘లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్ లేకే’ అనే పాటకు డాన్స్ చేసింది..