కృష్ణుడి విగ్రహానికి డాక్టర్ కట్టుకట్టారు..

  0
  17978

  దేవుడంటే భక్తి ఉంటుంది..దేవుడు లేదనే వాళ్ళుకూడా సృష్టిని నడిపే అదృశ్యశక్తిని కాదనలేరు.. కొంతమందికి దేవుడే లోకం.. అయన సేవలోనే తరిస్తారు.. ఆయన సేవకోసమే తపిస్తారు.. అలాంటి భక్తుడే రామ్ గోపాల్ లడ్డూ.. తన ఇంట్లో నిత్యం పూజించుకునే కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొని , కన్నీళ్లు పెట్టుకుంటూ , ఆగ్రా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు..

  బట్టల పొత్తిళ్ళ మధ్య కృష్ణుడి విగ్రహం ఉంది.. నేరుగా డాక్టర్ దగ్గరకెళ్ళి , ఏడుస్తూ , తన స్వామి విగ్రహానికి చేయి విరిగిందని , కట్టు కట్టండని ప్రాధేయపడ్డాడు.. యెంత డబ్బైనా ఇచ్చుకుంటానని చెప్పాడు.. మొదట్లో ఆశ్చర్యపోయిన డాక్టర్లు , అతడి ఏడుపు , ఆవేదన , భక్తి చూసి అతడికే దండం పెట్టారు.. అతడి విశ్వాసానికి , నమ్మకానికి తాము దండంపెట్టమన్నారు.. దేవుడికి కూడా వైద్యులు ట్రీట్మెంట్ చేయగలరని అతడి నమ్మకం తమకు ఆశ్చర్యం కలిగించిందని , అతడి భక్తికి దండం పెట్టామని అన్నారు..

  మొత్తానికి నమ్మకంతో వచ్చిన రామ్ గోపాల్ లడ్డూ. నమ్మకాన్ని వమ్ముచేయకుండా , విగ్రహానికి కట్టుకట్టి పంపారు.. రామ్ గోపాల్ లడ్డూ.ప్రతిరోజూ మూడుపూటలా విగ్రహానికి స్నానం చేయించి పూజచేస్తాడు.. ఉదయం స్నానం చేయించే సమయంలో విగ్రహం కిందపడి చేయి విరిగింది.. దానికి కట్టుకట్టమనే అతడు హాస్పిటల్ కి వచ్చాడు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.