మణుగూరులో కూడా ముంచింది.- లక్షలు కాజేసింది..

  0
  1477

  ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందో.. ఎంత‌మందిని మోసం చేసిందో.. తెలియ‌దు గానీ నిత్య పెళ్ళికూతురు సుహాసినిని ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా తీసుకెళ్ళారు. నెల్లూరుకి చెందిన సుహాసిని మొద‌ట త‌న మేన‌మామ‌ను పెళ్ళి చేసుకుంది. ఆ త‌ర్వాత మేన‌మామ త‌న సోద‌రుడ‌ని, గార్డియ‌న్ అని, ఇలా ర‌క‌ర‌కాలుగా భ‌ర్త‌ను ఎర‌వేసి, పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుని, పెళ్ళి చేసుకుని న‌గ‌దు, బంగారంతో వెళ్ళిపోయేది. ఇద్ద‌రు బిడ్డ‌లు కూడా ఉన్న సుహాసిని ఎప్పుడూ పెళ్ళి పేరుతో దోపిడీలు చేసేది. తిరుప‌తిలో ఓ యువకుడిని పెళ్ళి చేసుకుని దాదాపు ల‌క్ష‌లు నొక్కేసిన సుహాసిని, దానికి ముందే తెలంగాణ‌లోని మ‌ణుగూరులో దేవ‌ర‌కొండ విన‌య్ అనే యువ‌కుడిని పెళ్ళి చేసుకుంది. య‌ధాప్ర‌కారం తాను అనాధ‌ని అంటూ ప‌రిచ‌యం పెంచుకుని, ప్రేమ పేరుతో వ‌ల విసిసింది. ఆ త‌ర్వాత‌ రెండేళ్ళ క్రితం విన‌య్ ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ల‌కు ఇంట్లో డ‌బ్బు, బంగారం తీసుకెళ్ళిపోయింది. తిరుప‌తి జైలులో ఉన్న ఆమెను మ‌ణుగూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ కోసం తీసుకెళ్ళారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?