మట్టిని చూసి రేప్ నిర్థారించారు..

  0
  282

  అమ్మాయిని నేను లైంగికంగా కలవలేదు. ఆమెతో శారీరక సుఖాన్ని పొందలేదు, అంటే ఆమెను నేను రేప్ చేసినట్టు కాదు.. అంటూ తెలివిగా తప్పించుకోవాలని చూసిన ఓ నీఛుడికి బాంబే హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రేప్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పదేళ్లు కఠిన కారాగార శిక్ష వేసింది కోర్టు.

  ఈ సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రేప్ కేసుకి సరికొత్త నిర్వచనాన్నిచ్చాయి. 33ఏళ్ల నిందితుడు రేప్ కేసులో తనకు సెషన్స్ కోర్టు వేసిన శిక్షపై హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. నేరుగా తాను బాధితురాలితో లైంగిక చర్య జరపలేదని, కోర్టు తనకు వేసిన శిక్షను కొట్టేయాలని కోరాడు. ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు.. అతని వాదనను తిరస్కరించింది. లైంగిక చర్య జరక్కపోయినా, యోనిలో వేళ్లు పెట్టినా కూడా రేప్ గానే పరిగణిస్తామని చెప్పింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను సమర్థించింది. రేప్ జరిగినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసిన ప్రాంతంలో అతడి వీర్యం, బాధితురాలి బట్టలపై వీర్యం పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు, అక్కడి మట్టి నమూనాలను కూడా కోర్టుకిసమర్పించారు. దీంతో కోర్టు అతడికి శిక్ష వేసింది.

  లైంగికంగా ఇద్దరు కలవకపోయినా, ఆ ప్రయత్నం జరిగినా, ఆ ప్రయత్నంలో ఎక్కడైనా బాధితురాలిని తాకినా, లేదా తాకాలని ప్రయత్నించినా రేప్ కిందే లెక్క అని చెప్పింది. ఈ కేసులో బాధితురాలి బట్టలకింద ఉన్న మట్టి, నిందితుడి బట్టలకు అంటిన మట్టి, ఆ ప్రదేశంలో ఉన్న మట్టి ఆధారంగా శిక్ష విధించింది.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?