ఆకాశం ఎర్రబడింది.. భయంతో ఇళ్లలోకి పరుగులు..

    0
    223

    నీలం రంగు ఆకాశం రక్తవర్ణం అయితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది..? ఈ దృశ్యం ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు భయాన్ని కూడా పుట్టిస్తుంది. ఆకాశం ఎర్రబడడం ఏమిటని ఆశ్చర్యపోవద్దు. ఇదేదో పురాణ కథల్లో కల్పితం కాదు. చైనాలో జరిగిన ప్రకృతి విచిత్రం . జోష్ ఆన్ అనే నగరంలో సాయంత్రం వేళ ఉన్నపళంగా ఆకాశంలో మేఘాలు కింద రక్తవర్ణంతో భయం కలిగించింది. దీంతో ప్రజలంతా భయంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు .

    ఆకాశంలో అగ్ని పుట్టింది అని కొంతమంది, ఆకాశంలో ఉపగ్రహాలు మండి పోతున్నాయని మరికొంతమంది , గ్రహాంతర వాసులు ఆకాశంలో అగ్ని యుద్ధం చేస్తున్నారని ఇంకొంతమంది , చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. అయితే చివరకు అక్కడకు సమీపంలోని షాంగై నగరంలోని అధికారులు ఇది కేవలం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆకాశం ఎర్రబడి ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. దాదాపు 40 నిమిషాల తర్వాత ఆకాశం నీలం రంగు మారింది . ఇంతవరకు ప్రపంచంలో ఇలాంటి వైపరీత్యం జరగలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. నీటి ఆవిరిలో సూర్యుడు కిరణాలు పరావర్తనం చెంది ఇలా అవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.