శ్రీలంక ప్రధాని ఇల్లు తగలబెట్టేశారు..

  0
  83

  శ్రీలంకలో అశాంతి అవధులు మించిపోయింది . నియంత్రించేందుకు వీలులేని పరిస్థితి కలుగుతుంది . అంతర్గత పోరు నానాటికి ఎక్కువ కావడంతో పరిస్థితి చేయి దాటి పోతోంది . ఆర్థిక సంక్షోభం కాస్తా శాంతిభద్రతల సంక్షోభంగా మారిపోయింది . ఒకరకంగా శ్రీలంకలో ఇప్పుడు అంతర్గత యుద్ధమే జరుగుతుంది. అరాచకం , అశాంతి రాజ్యమేలుతోంది. శ్రీలంక ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్సా రాజీనామా చేసిన తర్వాత కురంగాల అనే ఊర్లో ప్రధానమంత్రి నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు . ఇదే కాకుండా పలువురు ఎంపీలు , నగర మేయర్ లు , ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ళు కూడా తగలబెడుతున్నారు .

  వీధుల్లో తిరిగే ప్రజాప్రతినిధుల పై దాడులు చేస్తున్నారు . ఈ ఆందోళనలో విద్యార్థి సంఘాలు ప్రముఖంగా పాల్గొంటున్నాయి . ప్రతిపక్ష పార్టీలు కూడా దేశంలో అరాచకం అశాంతిని సృష్టిస్తున్నాయి. ఒకరకంగా ఆర్థిక సంక్షోభం కారణంగా శాంతిభద్రతలు అదుపుతప్పడంతో ప్రధానమంత్రి తన పదవి నుంచి వైదొలిగారు . ఆయన పదవి నుంచి దిగిన కొద్దిసేపట్లోనే ఏకంగా ఆయన ఇల్లు తగలబెట్టడం, ప్రధాని బంధువుల పై దాడులు చేయడం, కనపడిన ప్రజాప్రతినిధులును , కొట్టడం ఇలాంటి సంఘటనలతో అసలు సమస్య పక్కదారి పట్టింది . ఆర్థిక సమస్య , సంక్షోభం శాంతిభద్రతల సమస్యగ మారింది.

  ప్రజలు సంయమనం పాటించాలని సీనియర్ నాయకులు సూచిస్తున్నప్పటికీ విద్యార్థి సంఘాలు పెడచెవిన పెడుతున్నాయి . ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థికమైన పరిష్కారాల తోనే ఎదుర్కోవాలి తప్ప, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని అందువల్ల దేశం మరింత సంక్షోభంలోకి పోతుందని చెబుతున్నప్పటికీ ఆందోళనకారులు మాత్రం వినడం లేదు.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.