వీడి దెబ్బకు సిఐ దిగొచ్చింది.. స్కూల్ కెళ్ళింది..

  0
  506

  చిన్న పిల్లలు ఒక్కో దఫా పెద్ద ఆలోచనలే చేస్తారు.. వాటిలో ఎంత సహేతుకత ఉందన్న విషయం పక్కనపెడితే , తమకు అన్యాయం జరిగింది అనిపిస్తే , ఏమిచెయ్యాలన్న విషయమే ప్రదానం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో , రెండో క్లాస్ చదివే , ఓ బాలుడు సడెన్ గ పోలీసు స్టేషన్ కి పోయాడు. సీఐతో మాట్లాడాలన్నాడు. బాలుడి పేరు అనిల్ కుమార్. సిఐ దగ్గరకెళ్ళిన బాలుడు , తన టీచర్ కొట్టిందని , అందుకని వెంటనే అరెస్ట్ చేసి , జైలుకు పంపమని అడిగాడు.

  ఎందుకు కొట్టిందని అడిగితే , తాను సరిగా చదవడంలేదని , అందుకే కొట్టిందని నిజం చెప్పాడు. మిగిలిన వాళ్ళను కూడా టీచర్ ఇలాగే కొడుతుందా అని అడిగితె , నిజాయితీగానే లేదని చెప్పాడు. మరి నువ్వు చదవాలి కదా , అని అడిగితే , చదవకపోయినా , కొట్టడం చట్టప్రకారం నేరమని , అందువల్ల టీచర్ ని అరెస్ట్ చేయమని డిమాండ్ చేసాడు. సిఐ తనతో వచ్చేదాకా వాడు స్కూల్ కి పోకుండా స్టేషన్లోనే ఉన్నాడు. చివరకు సిఐ స్కూల్ కి వెళ్లి , టీచర్ తో మాట్లాడి , బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పోయింది.. అదీ సంగతి..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..