సద్గురు జగ్గీ వాసుదేవ్ బైక్ ఫై 27 దేశాలకు..

  0
  177

  బైక్ రేసింగ్ , బైక్ పై దేశ పర్యటనలు , కుర్రాళ్ళు , క్రీడాకారులు చేయడం మామూలే.. అయితే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ , ఏకంగా 30 వేల కిలోమీటర్ల బైక్ రైడింగ్ కి సిద్ధమయ్యాడు. 30 వేలకిలో మీటర్లు అంటే ఎక్కడనుంచి అనుకుంటున్నారు.. ?

  ఏకంగా లండన్ నుంచి ఇండియా వరకు , 27 దేశాలమీద బైక్ రైడింగ్ తో ప్రయాణానికి సిద్దమయ్యాడు. ఈ నెల 21 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వందరోజులు పాటు సాగే ఈ బైక్ రైడింగ్ లక్ష్యం భూమిని కాపాడుకుందాం ,,అనే నినాదంతోనే మొదలవుతుందని అన్నారు.

  తన వందరోజుల , 27 దేశాల , 30 వేల కిలోమీటర్ల బైక్ రైడింగ్ లో తన శిష్యులు అందరూ , భూమిని కాపాడుకోవాలి , అని 10 నిముషాలు ఆలోచించాలని అన్నారు. భూమి కాపాడుకుందాం ..అన్న నినాదంతో ప్రారంభం అయ్యే తనయాత్ర ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించాలన్నదే తన ధ్యేయమన్నారు . ప్రాణం నిలుపుకునేందుకు పుడమి తల్లి , క్షేమంగా ఉండాలని అన్నారు.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..