అలా అయితే కొడుకులకు ఆస్తిలో వాటా రాదు ..

  0
  180

  తల్లితండ్రులు బ్రతికి ఉండగా , వాళ్ళ ఆస్తిలో వాటా కోరే హక్కు బిడ్డలకు లేదని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. తల్లిదండ్రుల బాగోగులు చూడకుండానే , వాళ్ళ ఆస్తిలో వాటా కోరే బిడ్డలకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిది. అవసానదశలో ఉండే తల్లితండ్రులను చూడకుండా , ముందుగా ఆస్తులు రాయించుని వదిలేసే బిడ్డల ఉదంతాలు కోకొల్లలు. ఈ తీర్పు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడకుండా వాళ్ళ ఆస్తులపై కన్నేసి బిడ్డలకు ఒక గుణపాఠం కావాలి. తల్లిదండ్రులు బతికున్నంతకాలం వాళ్ళ ఆస్తిలో వాటా ఇవ్వమని బలవంతం చేసే అధికారం కానీ, హక్కుకానీ బిడ్డలకు లేదని బాంబే హైకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది.

  ప్రభుత్వ అధికారిగా పనిచేసిన అనే వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు . ఆయన భార్య భర్తను చూసుకుంటంది. బిడ్డలు వదిలేశారు. మెడికల్ బిల్లు , కుటుంబ పోషణ ఆయన ఉద్యోగ కాలంలో ఆయన సంపాదించిన ఆస్తుల మీద వచ్చే ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారు . గత నాలుగేళ్లుగా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ , కొడుకులు ముగ్గురు కూతుళ్లు చూడలేదు. కానీ ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. కనీసం హాస్పిటల్కి తీసుకు పోయే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన కోమాలో ఉండి పోవడంతో బిడ్డలకు ఆస్తుల మీద కన్ను పడింది దీంతో తమ తల్లిదండ్రులను , ఆస్తులు పంచి ఇవ్వమని కోరుతూ దావావేశారు. …

  జస్టిస్ మాధవ్ పటేల్ , జమిందార్ న్యాయమూర్తులుగా ఉన్న డివిజన్ బెంచ్ ఈ కీలకమైన తీర్పును వెలువరించింది . చట్టపరంగా కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాళ్ళు బతికుండగా హక్కు లేదని స్పష్టం చేసింది. అలాంటిది తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆ ఆస్తుల్ని సొంతం చేసుకోవాలనుకోవడం అనైతికం అని వ్యాఖ్యానించింది . తండ్రీకొడుకుల బంధానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిదని అవమానకరమని కూడా వ్యాఖ్యానించింది. తల్లి తండ్రి ఇద్దరూ కష్టపడి బిడ్డలను చదివించి ప్రయోజకుల్ని చేసి ఇప్పుడు అందరూ బాగా ఉద్యోగాలు చేసుకుంటున్న దశలో అదే మీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఇంతకంటే ఏమి కావాలంటూ మందలించింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..