బైక్ పై స్నేహితుడి శవంతో ఊరంతా..

  0
  144777

  ఓ స్నేహితుడు చనిపోతే, చనిపోయిన స్నేహితుడుకి సృష్టిలో ఎవరూ ఊహించని, ఇవ్వలేని ఒక అద్భుతమైన కన్నీటి వీడ్కోలుని ఆ స్నేహితులు ఇచ్చారు. ఎరిక్ సెడనోస్ అనే యువకుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. స్నేహితులు బంధువులు, తల్లిదండ్రులు అందరూ ఆ యువకుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. శవపేటికను సమాధిలో పెట్టిన తర్వాత దాన్ని పూడ్చేశారు. అయితే ఇంటికెళ్లిపోయిన ఫ్రెండ్స్ కి తమ స్నేహితుడు పదే పదే గుర్తు రావడంతో ఒకరికొకరు మాట్లాడుకుని ఎరిక్ కు ఇష్టమైన రీతిలో వీడ్కోలు చెప్పలేకపోయామని భావించి, తల్లిదండ్రుల్ని ఓ వింతకోరిక కోరారు.

  సమాధిలోనుంచి తమ స్నేహితుడి శవాన్ని మళ్లీ బయటకు తీస్తామని, తీసి అందరం కలసి స్నేహితుడిని శవాన్ని మోటర్ సైకిల్ పై తీసుకెళ్లి ఊరంతా తిప్పి ఆ తర్వాత మళ్లీ సమాధి చేస్తామని చెప్పారు. బైక్ రైడింగ్ అంటే అమిత అష్టమైన తమ కొడుక్కి ఈ రకమైన వీడ్కోలు కూడా ఆత్మశాంతి కలిగిస్తుందని తల్లిదండ్రులు భావించి స్నేహితుల కోర్కెను కాదనలేకపోయారు. ఆ రాత్రి స్నేహితుడు సమాధివద్దకు వెళ్లి తమ స్నేహితుడి శవాన్ని వెలికి తీసి, ఒక్కొకరు ఒక్కో దఫా తమ స్నేహితుడిని మోటర్ సైకిల్ పై ఎక్కించుకుని రోజూ తాము తిరిగే ప్రాంతాల్లో తిరిగి తెల్లవారు ఝామున తిరిగి శవపేటికలో పెట్టి శ్మశానంలో పూడ్చేశారు. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ లో జరిగింది.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.