17 తుపాకుల వందనం ఎందుకంటే..?

  0
  371

  భార‌త త్రిదళాధిపతి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌కు 17 తుపాకుల‌తో గౌరవ వంద‌నం స‌మ‌ర్పించారు ఆర్మీ సిబ్బంది. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న బ్రార్ స్క్వేర్ శ్మ‌శాన‌ వాటిక‌లో రావ‌త్ దంప‌తుల‌కు తుది వీడ్కోలు ప‌లికారు. అంత్య‌క్రియ‌ల‌ను సైనిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించారు. అంత్య‌క్రియ‌ల‌ స‌మ‌యంలో త్రివిధ ద‌ళాలు 17 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పించాయి. ప్రోటోకాల్ ప్ర‌కారం సీనియర్‌ అధికారులు చనిపోయినప్పుడు ఆర్మీ గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పిస్తుంది. తుపాకీ వంద‌నం సమ‌ర్పిస్తున్నారంటే ఆ అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రుగున్న‌ట్టు అర్థం. రాజకీయ, సాహిత్య, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకి వందనం సమర్పిస్తారు.

  గ‌న్ సెల్యూట్ కి చరిత్ర ఉంది.
  21 గ‌న్ సెల్యూట్ సంప్ర‌దాయం బ్రిటీష్ వారినుంచి మనకు వార‌సత్వంగా లభించింది. బ్రిటన్ లో 101 గ‌న్ సెల్యూట్ ఉండేది. రాయ‌ల్ సెల్యూట్‌గా పిలిచే ఈ వంద‌నాన్ని కేవ‌లం బ్రిటీష్ క్రౌన్‌కు మాత్ర‌మే స‌మ‌ర్పించేవారు. దీని త‌ర్వాత వ‌చ్చిన 31 గ‌న్ సెల్యూట్‌ ను రాణి, రాజ కుటుంబాల‌కు స‌మ‌ర్పించేవారు. ఇదే ప‌ద్ధ‌తిని వైస్రాయ్‌, భార‌త గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌ కు కూడా పాటిస్తున్నారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్‌ సెల్యూట్ సమ‌ర్పించేవారు.

  భార‌త రాష్ట్ర‌ప‌తికి ప‌లు సంద‌ర్భాల్లో 21 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పిస్తారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణం చేసిన రోజున కూడా తుపాకీ వంద‌నం స్వీక‌రిస్తారు. ఇక ఇండిపెండెన్స్‌, రిప‌బ్లిక్ డే వేడుక‌ల సంద‌ర్భంగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.