కోట్లు సంపాదించే హీరోయిన్..కూలీగా మారిపోయింది..గుర్తు ప‌ట్టారా ?

  0
  438

  కోట్లు సంపాదించే హీరోయిన్…

  కూలీగా మారిపోయింది… గుర్తు ప‌ట్టారా ?

  స్టార్ హీరోయిన్ అంటే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కారు, బంగ్లా, డ‌బ్బు.. హోదా.. ఇలా ఒక‌టా రెండా.. అన్నీ ఆమె ఇంటి ముంగిట్లోనే ఉంటాయి. ఒక్క సినిమాలో న‌టిస్తే చాలు.. కోట్ల డ‌బ్బు హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న‌ట్లే. అలాంటి స్టార్ హీరోయినే ఈమె. ఆమె స్క్రీన్ మీద క‌న‌బ‌డితే చాలు.. ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి హీరోయిన్ .. కూలీగా మారింది. ఇంత‌కీ ఎవ‌రామె. ఈ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రు ? ఒక్క‌సారి స‌రిగ్గా చూడండి.

  తెలుగు సంవత్సరాది ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు త‌మ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి మాత్రం ఈ పండుగ‌ను కాస్త వెరైటీ జ‌రుపుకుంది. పండుగ నాడు ఆమె రైతు కూలీగా మారింది.

  సాటి కూలీల‌తో క‌లిసి పొలంలో ప‌సుపు కొమ్ములు తీసింది. ఆ ఫోటోల‌ను త‌న ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ‘‘వేర్లతో భూమి లోకి బలంగా నాటుకు పోయాయి… అయినా బ‌లంగా పెకిలించి బయటకు తీసేశాం’’ అంటూ సాయిప‌ల్ల‌వి కామెంట్ చేసింది. ఇది ఎక్కడో తెలియదు గానీ.. ఆమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.