ఆటోలో వచ్చింది. డైరెక్టర్ ని హత్తుకుంది..

    0
    2369

    అందాల తార శ్రియ ఏది చేసినా వెరైటీయే. తనకి గర్భం వచ్చిన సంగతి కూడా మీడియాకి తెలియనీయకుండా సడన్ గా కుమార్తెను పరిచయం చేసింది శ్రియ. తాజాగా గమనం అనే సినిమాలో చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాని చూసేందుకు ఆమె ఆటోలో థియేటర్ కి వచ్చింది. గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాలో శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. గమనం సినిమా ఈరోజే విడుదలైంది. ఈ సినిమాలో శ్రియ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

    ఈ సినిమాను చూసేందుకు హీరోయిన్ శ్రియ హైదరాబాద్‌లోని మల్లికార్జున థియేటర్ కు వచ్చింది. అయితే అందరిలా కారులో రాకుండా ఈ అమ్మడు ఆటోలో వచ్చి షాక్ ఇచ్చింది. శ్రియ ఆటోలో వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఆమె ప్రేక్షకులతో కలిసి సినిమా చూసారు. అనంతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది శ్రియ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియ.. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియ.

    ఇవీ చదవండి

    బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

    కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.