పుష్ప ఐటమ్ సాంగ్ విడుదలైంది..

  0
  706

  సహజంగా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో ఐటం సాంగ్స్ అల్లాడిపోతుంటాయి. కానీ ఈసారి పుష్ప సినిమాలో పాట మాత్రం ఆ స్థాయిలో ఎక్కేలా లేదు. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో సమంత స్టెప్పులేయడం. ప్రస్తుతానికి లిరికల్ సాంగ్ విడుదలైనా, సమంత స్టిల్స్ చూస్తుంటే మతి పోవాల్సిందే. సినిమాలో పాటని, మ్యూజిక్ ని సమంత డ్యాన్స్ డామినేట్ చేస్తుందని వేరే చెప్పాల్సిన పని లేదు.

  పుష్ప సినిమా కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదుల కానుంది. ఇక డిసెంబర్ 12 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇక మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే సునీల్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.