ఈదురుగాలుల్లో విమానం.,40 మందికి గాయాలు.

  0
  587

  ఆకాశంలో ఉండగా ఈదురు గాలుల్లో చిక్కుకున్న స్పైస్ జెట్ విమాన ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు . వారిలో పది మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. అయినా వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రకటించారు . ఇదేదో సినిమా కథ కాదు . మన దేశంలోనే ఆదివారం జరిగిన ఓ విమాన ప్రమాదం . పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ లో ఈ ప్రమాదం జరిగింది . స్పైస్ జెట్ విమానం ఆకాశమార్గంలో ఉండగా తీవ్రమైన పెనుతుఫాను గాలుల్లో చిక్కుకున్నది .

  దీంతో విమానం చిగురుటాకులా అటూ ఇటూ ఊగిపోయింది . ఈ ఉపద్రవం జరుగుతున్న తరుణంలో కేబిన్ లోఉన్న లగేజీలు ప్రయాణికుల మీద పడి 40 మంది గాయపడ్డారు . కొంతమంది విమానం ఆకాశమార్గంలో అటు ఇటు ఊగుతూ ఉండగా ,సీట్లు నుంచి విమానంలోనే కిందపడిపోయారు . భయంతో కేకలు పెట్టారు . దీంతో విమానం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది . పైలెట్ విమానాన్ని ఎయిర్పోర్ట్లో దించేశారు .

  విమానం దిగుతున్న సమయంలో కూడా విపరీతమైన గాలులకు ఊగిపోయింది ఈ ప్రమాదంపై విమానయాన సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ విమానం ముంబై నుంచి దుర్గాపూర్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది గాయపడ్డ ప్రయాణికులకు తక్షణమే చికిత్స అందించామని తెలిపింది. స్పైస్జెట్ ఎక్స్ప్రెస్ జరిగిన ప్రమాదానికి విచారం వ్యక్తం చేసింది . ప్రయాణికులకు అవసరమైన వైద్య సౌకర్యాలు కూడా తాము చేస్తామని పేర్కొంది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.