ప్రియుడి కోసం భర్తను కూల్ గా చంపేసింది..

  0
  335

  చాలాకాలానికి కలిసిన ప్రియుడుతో మళ్లీ సహజీవనం చేయాలని అతనితోనే ఉండి పోవాలి అన్న కుట్రతో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపేసింది. భార్యను అమితంగా ప్రేమించే అమాయకుడైన భర్త ప్రేమ ఆమె మోసానికి కామ దాహానికి బలైపోయింది . బెంగళూరులోని యశ్వంతపుర ప్రాంతంలో తెలుగువాడైన శంకర్ రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు . తిరుపతికి చెందిన ఢిల్లీ రాణి అనే యువతిని 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు . వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు .

  గత గురువారం రోజు ఆ బాలుడు అర్ధరాత్రి సమయంలో లేచి కేకలు పెడుతూ తన తల్లి ,తండ్రి రక్తపు మడుగులో ఉన్నారంటూ ఇంటి యజమాని కి సమాచారం అందించాడు . పోలీసులు వచ్చి భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ కి , తీసుకు పోయే సమయానికి శంకర్ రెడ్డి చనిపోయి ఉన్నాడు. ఢిల్లీ రాణి గాయాలతో చికిత్స పొందుతోంది . పోలీసులు హత్య ఎలా జరిగింది అని విచారించారు . గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తన భర్తను చంపి తన మెడలో తాళి బొట్టు కూడా తెంచుకుని వెళ్లిపోయారని ఢిల్లీ రాణి చెప్పింది .

  తనకున్న గాయాలను చూపించింది . అయితే ఆమె మెడలో గొలుసు గాని తాళిబొట్టు గాని పోలేదని పోలీసులకు తెలిసింది. ఈ విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకున్నారు . డాక్టర్ల నివేదిక ప్రకారం ఆమె చేతికి ఉన్న గాయాలు ఆమె స్వయంగా చేసుకునే విధానం అని ఇతరులు చేసిన గాయాలు కాదని చెప్పారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో ఢిల్లీ రాణిని విచారించారు . విచారణలో తన ప్రియుడు కోసం తానే భర్తను హత్య చేశానని ఢిల్లీ రాణి ఒప్పుకుంది.

  హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసు స్వాధీనం చేసుకుంది. నిద్రపోతున్న భర్తను , కత్తితో పొడిచి చంపేసినట్టు అంగీకరించింది. ఆమె గ్రామానికి చెందిన దూరపు బంధువుతో పెళ్లికి ముందు నుంచే వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉండేది . పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు దూరంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరూ మళ్ళీ పాత ప్రేమాయణాన్ని మొదలుపెట్టారు . దీంతో భర్తను చంపి ప్రియుడుతో , ఉండిపోవాలని భర్త హత్యకు ప్లాన్ చేసింది. దీనిలో ప్రియుడు పాత్రఏమిటో విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.