ఓ మహిళ ప్రాణాలు కాపాడడానికి తన కారును ధ్వంసం చేసుకున్నాడు ఓ వ్యక్తి. మద్యం మత్తులో ఓ మహిళ కారు డ్రైవ్ చేస్తోంది. అయితే మత్తు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. తల కారు స్టీరింగ్ పై వాలిపోయింది. కారు వేగం అంతకంతకూ పెరిగిపోయింది. కారు కంట్రోల్ లో లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు దూసుకుపోతోంది. అయితే ఓ వ్యక్తి తన కారులో వెళుతూ ఆమె కారును గుర్తించారు.
అపస్మారక స్థితిలో ఉందని గుర్తించి… ఆ కారుకు సమాంతరంగా వెళుతూ దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అదీ కుదరకపోవడంతో తన కారును వేగంగా ముందుకు పోనిచ్చి, ఆమె కారుకు ముందుకు వెళ్ళి బ్రేకులు వేస్తూ వచ్చాడు. కాసేపటి ఆమె ప్రయాణిస్తున్న కారు ఆగింది. అయితే అతని కారు వెనకభాగం మాత్రం ధ్వంసమైంది. కారులో ఉన్న మహిళకు పక్కటెముకలు విరిగాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. నెదర్లాండ్స్‌లో నన్స్ పీత్ టౌన్ లో ఈ ఘటన జరిగింది. తన కారు దెబ్బతిన్నా పర్వాలేదు కానీ ఓ ప్రాణాన్ని కాపాడగలిగానని కాపాడిన వ్యక్తి చెబుతున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Man sacrifices his car to save another driver who was unconscious..
Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez
— Buitengebieden (@buitengebieden_) November 21, 2021