ముందు నా సోదరి ,తరువాత నేను, సోనూ సూద్

  0
  200

  రియ‌ల్ హీరో సోనూసూద్ సోద‌రి మాల్విక రాజ‌కీయ‌ప్ర‌వేశం చేయ‌నుంది. త‌మ కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ క‌లిసి మాల్విక సూద్ స‌చార్ రాజ‌కీయ ప్ర‌వేశానికి అనుమ‌తించామ‌న్నారు. రాజ‌కీయాల్లో ఆమె ప్రజాసేవ చేయాల‌న్న ఆమె నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నామ‌ని సోనూ తెలిపారు. పంజాబ్ లోని త‌మ పూర్వీకుల ప్రాంతం మొఘ లోని త‌మ ఇంట్లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో సోనూ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

  త‌మ సోద‌రి ఏ పార్టీలో చేర‌బోతోంద‌నే విష‌యం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. తాను పంజాబ్ సీఎంతో జ‌రిపిన చ‌ర్చ‌ల‌కు సంబంధించి, త‌న సోద‌రి రాజ‌కీయ ప్ర‌వేశానికి సంబంధించి, ఏపార్టీ వారైనా త‌న‌ను క‌లుసుకోవ‌చ్చున‌ని, తాను వారిని క‌లిసి మాట్లాడ‌తాన‌ని అన్నారు. ఏ రాజ‌కీయ‌పార్టీలో చేర‌తామ‌న్న విష‌యం త‌మ ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు, సిద్దాంతాల‌కు సంబంధించిన విష‌య‌మ‌న్నారు. త‌మ సోద‌రి మొఘ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తుంద‌న్నారు. త‌న రాజ‌కీయ జీవితానికి సంబంధించి కూడా త్వ‌ర‌లోనే తాను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.