నెల్లూరుకు చెందిన ప్రముఖ మావోయిస్ట్ నేత రవి మృతి చెందినట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. విచిత్రమేమిటంటే, ఆయన మరణించిన ఏడాదిన్నర తర్వాత మావోయిస్ట్ పార్టీ ఈ విషయం చెప్పడం గమనార్హం.
మావోయిస్ట్ కేంద్రకమిటీ స్టాఫ్ కమిటీ సభ్యుడు కూడా అయిన రవి, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మాయిపాలెంకు చెందిన వ్యక్తి. 2014లో గెరిల్లా జోన్ లో విధులు నిర్వహించాడు.
గెరిల్లా యుద్ధతంత్రంలో రవి ఆరితేరిన వ్యక్తి. జార్ఖండ్ లో నక్సల్స్ కు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చేవాడు.
టెక్నికల్ పర్సన్ గా, కంప్యూటర్ ఆపరేటర్ గా కమ్యూనికేషన్ రంగంలో రవి నిష్టాతుడు. ఆధునిక మందుపాతరలు అమర్చడంలో సిద్ధహస్తుడు.
మావోయిస్టులకు కొత్త ఆయుధాలను సమకూర్చడంలో కూడా రవి కీలకపాత్ర పోషించేవాడని తెలిసింది. బాణం అనే బాంబును తయారు చేసి పరీక్షించే క్రమంలో దాన్ని పేలుడులో రవి మృతి చెందినట్లు సమాచారం.