సోనూ సూద్ ట్వీట్.. మరీ అంత కమర్షియలా..?

  0
  57

  నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల్ని ఇండియాకి రప్పించేందుకు ప్రత్యేక ఫ్లైట్ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా యుద్ధ నేపథ్యంలో సోనూ సూద్ మళ్లీ ఒక ట్వీట్ వేశాడు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన 1800మంది విద్యార్థులను భారత్ కి తిరిగి తెప్పించేందుకు ప్రభుత్వం ఏదైనా చేయాలని కోరారు.

  అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ వెంటనే సోనూ సూద్ అమెజాన్ కంపెనీకి చెందిన అడ్వర్టైజ్ మెంట్ పోస్ట్ చేశాడు. అసలు ఇదెక్కడి లెక్క. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని కాపాడాలంటూ సోనూ పోస్ట్ పెట్టి అక్కడితో ఆగితే బాగుండేది. దానికి కొనసాగింపుగా కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్ పెట్టడం దేనికోసం? నెటిజన్ల ట్రోలింగ్ కి సోనూ సూద్ సమాధానం చెప్పగలరా..?

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..