గూడూరు నెల్లూరులోనే.. కందుకూరు ప్రకాశం జిల్లా లోనే..

    0
    1046

    గూడురు జిల్లాను నెల్లూరులోనే కొనసాగించాలని, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలంటూ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ కి ఓ లేఖ రాశారు, ఆ ప్రతిని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి కూడా పంపించారాయన. జిల్లాల విభజనపై ఇటీవల చాలా చోట్ల వ్యతిరేకత వస్తోంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి ఉద్యమం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గూడూరుకోసం పట్టుబడుతున్నారు. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపకుండా, నెల్లూరులోనే కొనసాగించాలంటున్నారాయన. అదే సందర్భంలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లానుంచి విడదీసి నెల్లూరులో కలపొద్దని, ప్రకాశంలోనే ఉంచాలని కోరారు ఆదాల.

    కందుకూరు నియోజకవర్గ ప్రజలు పని మీద నెల్లూరుకు రావాలంటే 110 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుందని, అదే ఒంగోలు వారికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి అందుబాటులో ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కందుకూరును ప్రకాశంలో, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..