ఆ ఏటీఎం దొంగను అరెస్ట్ చేసే సమయంలో ఊరంతా ఒక్కటై..

  0
  243

  దేశంలో బ్యాంక్ ల ఏటీఎం దొంగతనాల్లో ఆ గ్రామస్తులు ఆరి తేరిపోయారు. గ్రామంలో సగం మంది యువకులు ఏటీఎంల కటింగ్ దొంగతనాలు చేయడంలో దిట్టలు. స్థానిక పోలీసులు కూడా సాహసం చేయలేనంత కరడు గట్టిన నేరస్తులు ఆ గ్రామంలో ఉంటారు. అయితే గ్వాలియర్ చంబల్ పోలీసులు..

  హర్యానా లోని మేవాత్ ఏరియాలోకి ప్రవేశించి అంద్రౌలా అనే గ్రామంలో కరడుగట్టిన ఏటీఎం నేరస్తుల్ని పట్టుకున్నారు. సినిమాల్లో చూపించే సీన్ కంటే రక్తి కట్టించే విధంగా పోలీసులు గ్రామంలోకి ప్రవేశించడం, గ్రామంలోని 200మంది పోలీసులపై తిరగబడి కాల్పులు జరపడం, పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ ఆ గ్రామంలో ముందుకు చొచ్చుకుపోవడం ఇలాంటి సినిమా సీన్లను తలదన్నే సన్నివేశాలతో ఎట్టకేలకు కుర్షిద్ అనే ఏటీఎం దొంగతనాల నాయకుడిని పట్టుకున్నారు.

  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కుర్షిద్ గ్యాంగ్ ఏటీఎంలను పగలగొట్టడం, కట్ చేయడం, వాటిని దోచుకోవడంలో ఆరితేరిపోయారు. ఆ గ్రామంలోకి ప్రవేశించి అతడ్ని అరెస్ట్ చేయాలంటేనే స్థానిక పోలీసులకు భయం పుట్టేది. ఆ గ్రామంలో ఏటీఎం దొంగలున్నారని తెలిసినా పోలేని పరిస్థితి.

  కుర్షిద్ గ్యాంగ్ ఇప్పటి వరకు 15కోట్ల రూపాయలకు పైగానే ఏటీఎంలను దోచుకుందని పోలీసులు చెబుతున్నారు. గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మరియు మొరీనా పోలీసులు ఉమ్మడిగా బృందాలుగా ఏర్పడి ఆ గ్రామంపై దాడి చేసి కుర్షిద్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యుద్ధ వాతావరణాన్ని తలపించే ఆ గ్రామంలో నేరస్తుల కాల్పులు, పోలీసుల ఎదురు కాల్పులు, నిందితుల్ని పట్టుకుంటున్న తీరుని వీడియో తీశారు. చూడండి..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..