సోనూ సూద్ ని కావాలనే టార్గెట్ చేశారా..?

    0
    146

    సోనూ సూద్ కార్యాలయాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా దాడులు జరుగుతున్నా.. ఎక్కడా సోనూ సూద్ పై ఎటువంటి ఫిర్యాదులు అందలేదు, ఆయన వ్యవహారంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫీస్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. సోనూ సూద్ మొత్తంగా 20కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్టు సమాచారం.

    మూడో రోజు ముంబైలోని సోనూసూద్ నివాసంతో పాటు, నాగపూర్, జైపూర్ లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ తనిఖీలలో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించారని సమాచారం. బాలీవుడ్ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోను సూద్ వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు.

    రాజకీయ పార్టీలు సోను సూద్ పై కొనసాగుతున్న ఐటీ తనిఖీలపై మండిపడుతున్నాయి. బీజేపీ కావాలనే సోను సూద్ ను టార్గెట్ చేస్తుందని, తమకు అనుకూలంగా లేని వారిని బెదిరించే క్రమంలోనే కేంద్ర సంస్థలను ఉపయోగిస్తుందని బీజేపీపై శివసేన, ఆప్, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.