సోనూ సూద్ కి అరుదైన గుర్తింపు.. అదనపు బాధ్యత

    0
    97

    రియర్ హీరో సోనూ సూద్ ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రశంసించాయి. చాలామంది నేతలు స్వయంగా ఆయనను అభినందించారు కూడా. కానీ తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం ఆయన శ్రమకు గుర్తింపునిచ్చింది, మరో పెద్ద బాధ్యతను కట్టబెట్టింది. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సోనూ సూద్ ని నియమించారు.

    త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించడానికి సోనూసూద్‌ అంగీకరించారని తెలిపారు సీఎం కేజ్రీవాల్. లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు సోనూ సూద్. అంతకంటే గొప్పసేవ మరొకటి లేదని చెప్పారు. తాము కచ్చితంగా కలిసి పనిచేస్తామని, లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మేం ఎంతో మందిని కలుసుకుంటున్నానని, అప్పుడే చదువు ఒక పెద్ద సమస్యగా ఉందనే విషయం తనకు అర్థమైందని చెప్పారు సోనూ సూద్. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించామన్నారు.

    రాజకీయాల్లో చేరిక గురించి ప్రశ్నించగా..‘‘మీరు మంచిపనులు చేస్తున్నారు, రాజకీయాల్లో చేరండి’ అని నాకు చాలామంది చెప్పారు. అందుకు తగ్గట్టే అవకాశాలూ వస్తున్నాయి. మంచిపని చేయడం కోసం వాటిలో చేరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వాటి గురించి ఆలోచించడం లేదు. కేజ్రీవాల్‌జీతో జరిగిన సమావేశంలో కూడా ఆ ప్రస్తావన రాలేదు’ అని అన్నారు.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్