సమంత అక్కినేని.. ఆమధ్య తన సోషల్ మీడియా అకౌంట్లలో అక్కినేని అనే పేరు తీసేసింది. దీంతో చాలామంది ఆమె ఫ్యామిలీ లైఫ్ లో ఏదో జరిగిందని వార్తలిచ్చారు. సోషల్ మీడియాలో ఆయితే నాగచైతన్యకు, సమంతకు వ్యవహారం బెడిసిందని, వారు త్వరలో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కూడా కథలల్లారు. ఇవన్నీ వట్టి కల్పితాలేనని తాజాగా స్పందించారు సమంత.
ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆ రూమర్లపై స్పందించారు. చెత్త రూమర్లుగా వాటిని కొట్టిపారేశారు. అసలలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదని అన్నారు. సహజంగా తాను పుకార్లపై స్పందించనని, కానీ దీనిపై స్పందిస్తున్నానని అన్నారు. మరో ఇంటర్వ్యూలో సమంత తన ఫ్రస్టేషన్ అంతా చూపెట్టారు. తనపై వచ్చిన ప్రతి వార్తకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తనకు స్పందించాలనిపిస్తేనే.. వాటి గురించి మాట్లాడతానన్నారు సమంత. అయితే ఇంత చెబుతున్న సమంత.. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే పేరు ఎందుకు తొలిగించిందో మాత్రం చెప్పడంలేదు.
ఇక మిగతా విషయాలకొస్తే.. సమంత, చైతన్య గోవాలో ఓ ఫామ్ హౌస్ ని కొంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రీమోడలింగ్ వర్క్ అంతా వచ్చే ఏడాదికి పూర్తవుతుందట. ఇటీవల సమంత చేసిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో రాజి అనే నెగెటివ్ పాత్రలో కనిపించింది సమంత. ఆ వెబ్ సిరీస్ తనకు మంచి పేరు తెచ్చిందని, తనలోని నటిని మరో కోణంలో ఆవిష్కరించిందని చెప్పుకొచ్చింది సమంత. కొత్తగా ఇప్పుడు శాకుంతలం అనే సినిమా చేస్తోంది.