ఆన్ లైన్ గేమ్ పిచ్చిలో ఇంటికే కన్నం

  0
  420

  ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిలో చెన్నైలో ఓ బాలుడు ఇంట్లో నుంచి 34 లక్షలు డబ్బు , 240 సవర్ల బంగారంతో పారిపోయాడు.. చెన్నై వాటర్ వర్క్స్ లో తండ్రి కాంట్రాక్టర్,, తల్లి ఓక కాలేజీలో ప్రొఫెసర్ గ పనిచేస్తోంది. మొబైల్లో ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటుపడ్డ 15 ఏళ్ళ బాలుడిని ఇటీవల , తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో మొబైల్ వాడకంపై ఆంక్షలు పెట్టారు. చదువు మీద దృష్టిపెట్టమని మందలించారు.. దీంతో రెండు రోజుల క్రితం తల్లి , తండ్రి ఇంట్లోలేని సమయంలో , డబ్బు , నగలు తీసుకొని వెళ్ళిపోయాడు. తన మొబైల్ కూడా ఇంట్లోనే పెట్టేసి , కొత్త ఐ ఫోన్ కొని , నంబర్ కూడా మార్చేసి వెళ్ళిపోయాడు.

  చెన్నై నుంచి నేపాల్ లోని ఖాట్మండ్ కు ఫ్లయిట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. ఉదయాన్నే నాలుగున్నరకు ఫ్లయిట్ కు పోవాలని ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అయితే తన ఫ్రెండ్ కి , ఈ ప్లాన్ గురించి ఎస్సెమ్మెస్ పెట్టడంతో , పోలీసులకు చిక్కిపోయాడు.. మొబైల్లో ఆన్ లైన్ గేమ్స్ చాలామంది పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. పెద్దల మొబైల్స్ లో , బ్యాంకు అకౌంట్ నంబర్లు ట్రేస్ చేసి , గంటల్లో వేలు , లక్షలు ఖర్చుపెట్టేస్తున్నారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.