తాగుబోతులు అబద్దం చెప్పరు.. మాటే సాక్ష్యం.

  0
  476

  తాగినోడు అబ‌ద్దం చెప్ప‌డు. నిజం చెప్తాడో లేదో తెలియ‌దు కానీ తాగినోడు అబద్దం చెప్ప‌డ‌ని నానుడి. ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎక్సైజ్ అధికారి ఆర్.పి.కిరార్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. అస‌లు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందంటే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని కంద్వా జిల్లాలో మ‌ద్యం కొనాలంటే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉండాలి. అలా వేసుకున్న వారికే షాపులో మ‌ద్యం ఇస్తారు. ఈ మేర‌కు అధికారి లిఖిత పూర్వ‌క ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇక్క‌డ ఓ వెసులుబాటు కూడా ఇచ్చారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు, స‌ర్టిఫికెట్లు ఏమీ చూపించాల్సిన అవ‌స‌రం లేదు. రెండు డోసులు వేసుకున్నాన‌ని చెబితే చాలు మ‌ద్యం ఇచ్చేస్తారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోకున్నా.. వేసుకున్న‌ట్లు చెప్పి, మ‌ద్యం అడిగితే ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆ అధికారి చెప్పిన స‌మాధానం.. భార‌త‌దేశంలో తాగిన‌వాడు ఎప్పుడూ అబ‌ద్దం చెప్ప‌డు. నిజ‌మే చెప్తాడు. తాగిన వాడు నిజ‌మే చెప్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. ఆయ‌న ఏమ‌న్నాడో ఈ వీడియోలో చూడండి.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.