తన ప్రేమ నిరాకరించాడనే కారణంతో ఓ ప్రియురాలు ప్రియుడిపై యాసిడ్ పోసింది. ప్రస్తుతం అతని పరిస్తితి ప్రమాదకరంగా మారింది. వేరే అమ్మాయితో పెళ్ళి చేసుకునేందుకు ఓ చర్చిలోకి వెళుతుండగా, ఆమె ఈ దాడి చేసింది. కేరళకు చెందిన షీబా అనే యువతికి అరుణ్ కుమార్ తో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుని బాసలు చేసుకున్నారు. కొంతకాలం వరకు వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది. షీబాకు ఇదివరకే పెళ్ళై , ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం తెలిసి అరుణకుమార్ , ఆమెను వద్దనుకున్నాడు.
అరుణ్ కు మరో యువతితో పెళ్ళి నిశ్చయం అయింది. పెళ్ళి చేసుకునేందుకు అతడు వెళుతుండగా షీబా అతడిపై యాసిడ్ పోసింది. దీంతో అరుణ్ కుమార్ ముఖం అంతా కాలిపోయి కంటిచూపు పోయింది. అతడిని త్రివేండ్రంలోని ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ చుక్కలు పడి షీబాకు కూడా ముఖం, చేతులపై గాయాలయ్యాయి. ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.