అత్తమామల ఆస్తిలో అల్లుళ్లకు హక్కు ఉందా ..?

  0
  1575

  అత్తమామల ఆస్తిలో అల్లుడికి హక్కులేదని కేరళ హైకోర్టు చెప్పింది. కూతురిని చేసుకున్నంతమాత్రాన ,అల్లుడు అత్తమామల కుటుంబంలో భాగస్వామి కాలేదని స్పష్టం చేశారు. అందువల్ల అల్లుడికి అత్తమామల ఆస్తిపై ఎటువంటి హక్కురాదని , లేదని కూడా స్పష్టంచేశారు. మామ ఆస్తిలో తనకు భాగం ఉందంటూ అల్లుడు డేవిడ్ రఫెల్ దాఖలుచేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మామ ఆస్తిలో వాటా కోరడం మీకు సిగ్గుచేటు అనిపించలేదా ..? అని కోర్టు ప్రశ్నించింది. ఇకనుంచి మామ పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లొకికూడా పోవద్దని ఆదేశించింది. కన్నూరులో ఓ అల్లుడు తన మామ ఆస్తి , భూములు , ఇంటిలో భాగం కోరుతూ కింద కోర్టులో వేసిన దావాని ఆ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో సవాల్ చేసాడు..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.