తమన్నాని ఘోరంగా అవమానించిన జెమినీ టీవీ

  0
  369

  మిల్కీ బ్యూటీకి ఘోర అవమానం జరిగింది. ఉన్నఫళంగా ఆమె హోస్ట్ చేస్తున్న ఓ షో నుంచి తొలగించేశారు. ఈ విషయంపై తమన్నా కూడా చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన తమన్నా.. టీవీ షోస్ విషయానికొచ్చే సరికి తొలి షోలోనే ఫ్లాప్ అయింది.

  రీసెంట్ గా బుల్లితెర పై మాస్ట‌ర్ చెఫ్ అనే తెలుగు కార్య‌క్ర‌మానికి త‌మ‌న్నా హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహ‌కులు భారీ రెమ్యున‌రేష‌న్‌ను చెల్లించారు. అయితే ఐపీఎల్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 5 , ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు వంటి కార్య‌క్ర‌మాల మధ్యలో త‌మ‌న్నా హోస్ట్ చేస్తున్న మాస్ట‌ర్ చెఫ్‌ అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో త‌మ‌న్నా స్థానంలో జ‌బ‌ర్‌ద‌స్త్‌తో హాట్ బ్యూటీ యాంక‌ర్‌ అన‌సూయ ను హోస్టింగ్ చేయిస్తున్నారట. ఇక దీని పై తమన్నా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

  అటు సినిమాలు తగ్గిపోవడం, ఇటు హోస్ట్ గా చేస్తున్న ఏకైక షో మిస్ కావడంతో తమన్నా బాగా హర్ట్ అయిందట. అందులోనూ ఈ షో లో తన గాత్రాన్ని పరిచయం చేసింది. సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకుంది. అయితే తమన్నా గొంతు కూడా ఈ షో కి మైనస్ అయిందని అంటున్నారట నిర్వాహకులు. అందుకే ఆమెను తీసేసి హాట్ యాంకర్ అనసూయతో పనికానిచ్చేస్తున్నారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.