భీమవరం మోడీ సభలో చిరంజీవి షాక్..

  0
  2072

  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మోదీ విమానం దిగగానే సీఎం జగన్ ఆయనను ఘనంగా సత్కరించి.. ఆహ్వానం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమయ్యారు. ఏ హోదాలో మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో తెలియదు కానీ.. ఆయన రాక మాత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

  ప్రధాని మోదీ పర్యటన అంటే ప్రోటోకాల్ పక్కాగా పాటిస్తుంటారు. ప్రధాని మోడీ పాల్గొనే సభలు, సమావేశాల్లో ఎవరెవరు హాజరవుతారో ముందుగానే పీఎంవో నుంచి ఆదేశాలు వస్తాయి. పీఎంవో ఆదేశాల ప్రకారమే.. ఎవరినైనా అనుమతిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ రఘురామ కృష్ణ రాజు పాల్గొంటారని స్వయంగా ఆయనే లైవ్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. దమ్ముంటే తనను ఆపాలని సవాల్ కూడా విసిరారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సభకు రావాలని ఆహ్వానం వచ్చినప్పటికీ ఆయన వెళ్ళలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు ఆహ్వానించారనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.

  ప్రధాని మోదీ ఆఫీసు నుంచి అసలు ఎందుకు ఆహ్వానం వెళ్లిందనేది కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ ముఖ్య నేతలకు కూడా ప్రధాని పర్యటనలో అనుమతి లేదు. అలాంటిది చిరంజీవిని ఎందుకు పిలిచారనే విషయమై, రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. సాధారణంగా చిరంజీవి ఏ జిల్లాకు వచ్చినా.. ఆయన అభిమాన సంఘాలకు ముందుగా సమాచారం ఇస్తుంటారు. అయితే తాజాగా భీమవరం పర్యటనలో ఈ ఉదయం వరకూ అభిమానులకు కూడా ఎలాంటి సమాచారం అందలేదు. చిరు భీమవరం వచ్చేవరకూ కూడా అభిమానులకు తెలియనివ్వలేదు. ఆఖరి నిమిషంలో కొందరు అభిమానులకు తెలియడంతో వారంతా మెగాస్టార్ చిరుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా చిరు ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.