ఎంపీ రఘురామ రాజు మధ్యలో రైలెందుకు దిగేసాడు..?

  0
  2438

  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భీమవరం వస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్‌ విధానంలో ఆవిష్కరిస్తారు. మోదీ రాక నేపథ్యంలో ఈ సభకు ఎంపీ రఘురామకృష్ణ రాజు , హాజరుకావాలని గత రాత్రి నరసాపురం ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణమయ్యారు. మధ్యలోనే , రాత్రి 11 గంటల సమయంలో దిగేసి వెళ్లిపోయారు.

  సీఎం జగన్ తో తీవ్ర విభేదాల నేపథ్యంలో రఘురామకృష్ణ రాజు గత 30 నెలలుగా రాష్ట్రానికి రాలేదు. పోలీసులు , కేసులు , దాడులు భయంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు.. కాదంటే హైదరాబాద్ వరకే వచ్చిపోతుంటారు. ప్రధాని , తన నియోజకవర్గంలోని భీమవరంకు రావడంతో ఎంపీ హోదాలో తానుకూడా రావచ్చునని ఏర్పాట్లు చేసుకున్నాడు. పోలీసులు , వైసిపి కార్యకర్తల దాడులు నుంచి తనను తానూ కాపాడుకునేందుకు , కేంద్రం నుంచి , జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు. హైకోర్టులో కూడా తనపై కేసులు పెట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ వేసాడు.

  బీమవరంకు హెలికాఫ్టర్ లో రావాలని , ప్లాన్ చేసినా , అనుమతి లేకపోవడంతో , గత రాత్రి నరసాపురం ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణమయ్యారు. మధ్యలోనే , రాత్రి 11 గంటల సమయంలో దిగేసి వెళ్లిపోయారు. తన రాకతో , తన అనుచరులను పోలీసులు కేసులపేరుతో హింసిస్తున్నారని , అందుకే తాను రిటర్న్ అవుతున్నానని చెప్పాడు. అయితే , ఆయన పేరు సెక్యూరిటీ జాబితాలో లేదు. ప్రధానిని ఆహ్యానించే జాబితాలోగానీ , వేదికపైగానీ , రఘురామకృష్ణ రాజు పేరులేకపోవడంతో , ఆయన వెనుతిరిగి పోయాడని తెలిసింది. డిఐజి కూడా , ఎంపీ రఘురామకృష్ణ రాజు పేరు ఆహ్వానితుల జాబితాలో లేదని చెప్పారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.