ముహూర్తం దగ్గరపడింది.. మంత్రుల్లో మాజీలు అయ్యేదెవరు..?

  0
  409

  రాష్ట్ర మంత్రి వర్గం త్వరలోనే మారబోతోంది. మంత్రులను మార్చి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రి వర్గం రెండేళ్లు పూర్తయిన తర్వాత కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత మంత్రులు కావాలన్న ఆశతో ఉన్నవారు ఎప్పిటికప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు త్వరలోనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు కానుందనే సంకేతాలనిచ్చింది.

  కొత్త జిల్లాల ఏర్పాటుకు వారం రోజులు అటు, ఇటుగా మంత్రి వర్గం ఏర్పడబోతోందని సంకేతాలు కూడా అందాయి. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపే సమయంలో ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. మంత్రి పదవికోసం చాలామంది పోటీలో ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. మంత్రి వర్గంలో స్థానం లేనంతమాత్రాన వారిని దూరం చేసుకున్నట్టు కాదని, వారు సమర్థులు కాదని తొలగించినట్టు కూడా కాదని స్పష్టం చేశారు.

  మళ్లీ గెలిస్తే మంత్రులుగానే ఉంటారని, మంత్రి వర్గంలో లేనివారు పార్టీకోసం పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. దీన్నిబట్టి మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేస్తారా లేదంటే కొద్దిమందిని కొనసాగించి మిగిలినవారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశమిస్తారా అన్నది స్పష్టంగా లేదు. మంత్రివర్గంలో లేనివారు పార్టీకోసం పనిచేయాలని సీఎం చేసిన వ్యాఖ్య ఇప్పుడు మంత్రి వర్గం పూర్తి స్థాయిలో ప్రక్షాళణ జరుగుతుందా, లేక పాక్షికంగా ప్రక్షాళణ జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..