నాగుపాము విషం తరలిపోతోంది..

  0
  554

  గత నాలుగేళ్లలో పాముల విషం వందల కోట్ల రూపాయల లాభాలను కుమ్మరిస్తోంది. కస్టమ్స్ అధికారుల లెక్కల ప్రకారం 2015నుంచి గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాలనుంచి 175కోట్ల రూపాయల నాగుపాముల విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మూడు సీసాల్లో చైనాకు సరిహద్దులనుంచి తరలిపోతున్న విషం స్వాధీనం చేసుకున్న అధికారులు దాని విలువ కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. రెడ్ డ్రాగన్ మేడిన్ ఫ్రాన్స్ 6097 అనే సీక్రెట్ కోడ్ మీద మన దేశంలోని గుజరాత్, తమిళ నాడు, బీహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున విషం సేకరించి వ్యాపారం చేస్తున్నారు. దీనికి పశ్చిమ బెంగాల్ కేంద్రంగా వ్యాపారం జరుగుతోంది. ఆ సరిహద్దులనుంచి బంగ్లాదేశ్ కు అక్కడినుంచి నేపాల్, భూటాన్ రాష్ట్రాలకు, ఈ నాగుపాము విషం తరలిపోతోంది.

  థాయిలాండ్ నుంచి వచ్చే పాము విషం కూడా బంగ్లాదేశ్, నేపాల్ మీదుగానే చైనా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోంది. చైనాలో చేసే సాంప్రదాయ వైద్యాల్లో పాము విషం విస్తృతంగా వినియోగిస్తారు. ఇది కాకుండా వివిధ మందుల కంపెనీలు కూడా పక్షవాతం, గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే వ్యాధుల్లో పాము విషంలోని ఎంజైముల ద్వారానే ఇంజక్షన్లు తయారు చేస్తుంటారు. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా పాము విషానికి ఇంత డిమాండ్ ఉంది. ఇది కాకుండా ఇటీవల కాలంలో వివిధ రకాల పాముల్ని వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కిందకి తీసుకు రావడంతో, పాముల విషానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్