పాపం , ఎండలకు ఫ్రిజ్ లో దాగిన పాము..

  0
  569

  ఎండాకాలం ,ఎండలు ముదిరి పోతున్నాయి . తల బయట పెట్టలేని పరిస్థితి. ఎండల్లో చాలామంది ఫ్రిజ్లో చల్ల నీళ్లు తాగి సేదతీరాలని ఆశపడుతుంటారు . అయితే కర్ణాటకలోని శివమొగ్గలో ఓ పాము ఫ్రిజ్ లో సేద దీరింది.. పుట్టలోనో , పొదల్లోనో ఉండాల్సిన పాములు ఫ్రిజ్ లో కూడా ఉంటాయా అని తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే . ఎండకు తాళలేకనో , లేదంటే యజమాని తెచ్చిన వస్తువుల్లో దూరి వచ్చిందో ,తెలియదు గానీ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ఒకరింట్లో ఫ్రిజ్ లో పాము తాండవించింది .

  పాపం కూల్ వాటర్ కోసం ఫ్రిజ్ తీస్తే ఉల్లిపాయలు ట్రే లో పాము బుస కొట్టింది. దీంతో భయపడిపోయిన ఇంట్లో మహిళలు బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత ఇంటి యజమాని , స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు . అతడు వెంటనే వచ్చి ఫ్రిజ్ లో ఉన్న పాముని పట్టుకుని అడవిలో వదలి వేశాడు . ఇంతకీ పాము ఫ్రిజ్ లోకి ఎలా దూరింది అన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది . మొత్తానికి ఎలాగో కాసేపు ఫ్రిజ్ లో ఉండి చల్లగా సేదదీరింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..