క‌ర్నూలు క‌లెక్ట‌ర్ కొడుకు..అంగ‌న్ వాడీ స్టూడెంట్.

  0
  126

  క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ కొడుకు…
  అంగ‌న్ వాడీ స్కూల్ స్టూడెంట్…
  ===================
  ప్ర‌భుత్వ స్కూళ్ళు బాగుంటాయి. ప్ర‌భుత్వ స్కూళ్ళ‌ల్లోనే మీ పిల్ల‌ల‌ను చ‌దివించండి. అంటూ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ,ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు, అధికారులు చెబుతుంటారు. కానీ ఏ ఒక్క అధికారిగానీ, ప్ర‌జాప్ర‌తినిధులుగానీ.. వారు త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ స్కూళ్ళ‌ల్లో చ‌దివించిన సంద‌ర్భాలు చాలా అరుదు. ఆద‌ర్శాలు ఆచ‌ర‌ణ‌లో చూపించే వారు కొంద‌రే. ఆ కొంద‌రిలో ఒక‌రు క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ కోటేశ్వ‌ర‌రావు. ఇప్పుడు ఈయ‌న గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ఈ క‌లెక్ట‌ర్ త‌న కొడుకు అంగ‌న్ వాడీ స్కూల్లో చేర్పించి ఆద‌ర్శంగా నిలిచారు.

  కలెక్టర్‌ కోటేశ్వరరావు, స్వర్ణలత దంపతుల కుమారుడు దివి అర్విన్‌. క‌లెక్ట‌ర్ భార్య‌ స్వర్ణలత హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. వీరు తమ కుమారుడు ఆర్విన్‌ను బుధవారపేటలోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించడం విశేషం. నిజానికి ఏ కార్పోరేట్ స్కూల్లోనో.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్లోనే చేర్చించే స్థాయి ఆయ‌న‌ది. అయినా అలాంటి స్కూళ్ళ గురించి ఆలోచించ‌కుండా ప్ర‌భుత్వం నిర్వ‌హించే అంగ‌న్ వాడీ స్కూల్లో త‌న కొడుకుని చేర్పించారు. ఆద‌ర్శాలు చెప్ప‌డంలో కాదు.. ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించ‌డంలోనే ఆ క‌లెక్ట‌ర్ గొప్ప‌త‌నం క‌ళ్ళ‌కు క‌డుతోంది. కాగా క‌లెక్ట‌ర్ నిర్ణ‌యం ప‌ట్ల‌, ఆద‌ర్శంగా నిల‌వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..