చావు ఎప్పుడు ఏరూపంలో వస్తుందో చెప్పలేము.. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయిన నాగుపాము కూడా మరొక మనిషిని చంపగలదంటే నమ్మడం కష్టమే.. కానీ నమ్మాల్సిందే.. ప్రపంచంలో అతికొద్ది విచిత్రాల్లో ఇదొకటి.. స్పిట్టింగ్ కోబ్రా పాముతో సూప్ తయారీకి ఆర్డర్ వచ్చింది. ఈ సూప్ తయారుచేయడంలో ఫెంగ్ పాన్ అనే చెఫ్ కు మంచిపేరుంది. ఆరుగురు కోసం , ఆయన సూప్ రెడీ చేసాడు.. ఇందుకోసం ఇండోచైనీస్ స్పిట్టింగ్ కోబ్రా ను , తల వేరుచేసి , బేసిన్ లో వేసేశాడు. పామును ముక్కలు , ముక్కలుగా చేసి , 20 నిమిషాల్లో సూప్ చేసాడు. తరువాత , వాష్ బేసిన్ కడుగుతూ , అంతకు 20 నిమిషాల ముందే కట్ చేసి పారేసిన పాము తలను పట్టుకోబోతే , అది చెఫ్ చేతిని గట్టిగా కరిచింది. 20 నిమిషాల క్రితం చంపేసి , పారేసిన తలా అది .. దాని శరీరం మొత్తం సూప్ గా కూడా రెడీ అయి , గెస్టులు ఆరగిస్తున్నారు. అయినా విచిత్రం , తలలో ఇంకా ప్రాణముంది.. చెఫ్ అరుపులకు అందరూ వచ్చి , పాము కోరలను చేతినుంచి తీసేసారు.. అయితే ఐదు నిమిషాల్లోనే చెఫ్ చనిపోయాడు.. దక్షిణ చైనాలోని గుఅండాంగ్ లో జరిగిందీ ఘటన..
ఇవీ చదవండి..
రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..
ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్