తమ్ముడికి అక్కలు లివర్ దానంచేసి , రక్షగా ..

  0
  308

  సోద‌రీ సోద‌రుల బంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌నంలో ఈ అక్కాచెల్లెళ్ళ‌ది ఒక ప్ర‌త్యేక‌త‌.  అక్ష‌త్ అనే త‌మ్ముడికి ఈ అక్క‌చెల్లెళ్ళు ఇద్ద‌రూ రాఖీలు క‌ట్టారు. ఆ త‌మ్ముడి ప్రాణాల‌ను నిలుపుకుని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బుధ‌వ‌న్ లో నేహా, ప్రేర‌ణ అనే ఈ అక్క‌లు ఇద్ద‌రూ చావుబ‌తుకుల్లో ఉన్న త‌మ త‌మ్ముడికి లివ‌ర్ దానం చేశారు.

  త‌మ్ముడికి ఆ విధంగా బ‌తికించుకుని ఇప్ప‌టికీ కంటిపాప‌లా చూసుకుంటున్నారు. 14 ఏళ్ళ వ‌య‌సుకే 92 కిలోలు బ‌రువు ఉన్న అక్ష‌త్ కు క్ర‌మంగా లివ‌ర్ ట్ర‌బుల్ వ‌చ్చి అది ప్రాణం మీద‌కి తెచ్చింది. అత్యంత అరుదైన‌రీతిలో ఈ బాలుడికి లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింది. డాక్ట‌ర్లు ఇద్ద‌రు అక్క‌ల శ‌రీరం నుంచి లివ‌ర్ తీసుకుని, ఆప‌రేష‌న్ చేసి లివ‌ర్ మార్పిడి చేశారు. మామూలుగా ఒక‌రి నుంచే లివ‌ర్ తీసుకుంటారు. అయితే ఈ బాలుడికి ఎక్కువ మొత్తంలో లివ‌ర్ పెట్టాల్సి రావ‌డంతో, ఇద్ద‌రి నుంచి లివ‌ర్ తీసుకున్నారు. తోడ‌పుట్టిన‌ అక్కలే కాబ‌ట్టి లివ‌ర్ స‌రిపోయింది. అక్క‌త‌మ్ముళ్ళ మ‌ధ్య అనుబంధానికి ఇదో నిద‌ర్శ‌నం.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..