ఇద్దరు తోడికోడళ్లు.. కోటీశ్వరుల కోడళ్ళే.. ఆస్తులకు ఇద్దరూ జుట్లుపట్టుకొని వీధినపడి కొట్టుకున్నారు. కొట్టుకుంటున్నవాళ్ళు అంతటితో ఆగలేదు.. అలాగే జుట్లు పట్టుకొని , ఇంటిముందున్న డ్రైనేజి కాలువలో పడ్డారు.. డ్రైనేజి కాలువలో పడ్డప్పటికీ , తగ్గేదేలేదన్నట్టు పోరాటం మాత్రం ఆపలేదు.
కాలువలో కూడా జుట్లు వదల్లేదు. దీంతో రెండు పక్షాల్లో మగవాళ్ళుకూడా , తగాదా పరిష్కరించకుండా , వీళ్లకు అండగా , డ్రైనేజి కాలువలోకి దూకి కొట్టుకున్నారు.. ఈ డ్రైనేజీ కాలువ పోరాటాన్ని , చుట్టుపక్కలవాళ్ళు వినోదంగా చూస్తూ , ఇంతకంటే మంచి సీన్ రాదన్నట్టు వీడియో తీసుకున్నారు..
చివరకు ట్రాఫిక్ ఆగడంతో పోలీసులే రంగంలోకి దిగి , కాలువలో జుట్లుపట్టుకుని కొట్టుకుంటున్న తోడికోడళ్ళను విడదీశారు.. ఈ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగింది..
अजमेर के करोड़पति घर की देवरानी-जेठानी में हुआ विवाद, लड़ते लड़ते नाले में गिरी pic.twitter.com/XQbT1XKrs0
— The Fact Factory. (@FactTheFactory) June 17, 2022