బ్రతకలేకున్నా,హెలికాఫ్టర్ కు లోన్ ఇవ్వండి.,

  0
  351

  వ్య‌వ‌సాయానికి గిట్టుబాటు కావ‌డం లేద‌ని ఓ రైతు ఏం చేశాడో తెలిస్తే.. షాక్ తింటారు. అత‌డేదో దుకాణం పెట్టుకుంటాన‌నో, వ్యాపారం చేసుకుంటాన‌నో.. చెప్ప‌లేదు. త‌న‌కు వ్య‌వ‌సాయం గిట్టుబాటు కావ‌డం లేద‌ని ఓ హెలికాఫ్ట‌ర్ కొని అద్దెకు తిప్పుకుంటాన‌ని, అందుకోసం త‌న‌కు రుణం ఇవ్వాలంటూ ఓ బ్యాంకుకు అప్లికేష‌న్ పెట్టుకున్నాడు. మ‌హారాష్ట్ర‌లోని గోరేగావ్ జిల్లా త‌క్తోడా గ్రామంలో కైలాస్ ప‌తంగి అనే రైతు గురువారం నాడు బ్యాంకుకు వెళ్ళాడు. వ‌ర్షాలు లేక‌పోవ‌డం.. క‌రువు ప‌రిస్థితుల్లో వ్య‌వ‌సాయం త‌న‌కు గిట్టుబాటు రావ‌డం లేద‌ని, త‌న‌కున్న రెండు ఎక‌రాలు బ్యాంకులో త‌న‌ఖా పెట్టుకుని హెలికాఫ్ట‌ర్ కొనుగోలు చేసుకునేందుకు లోన్ ఇవ్వాలంటూ మేనేజ‌ర్‌ని కోరి అప్లికేష‌న్ పెట్టుకున్నాడు.

  ఇందుకోసం 6 కోట్ల 60 ల‌క్ష‌ల రూపాయ‌లు లోన్ అవ‌స‌రం అంటూ కొటేష‌న్ కూడా ఇచ్చాడు. ఈ హెలికాఫ్ట‌ర్‌ను పెళ్లిళ్ళ‌కు ప్ర‌ముఖుల‌కు అద్దెకు ఇచ్చి డ‌బ్బులు సంపాదిస్తాన‌ని, నెల‌కు 15 ల‌క్ష‌ల రూపాయ‌ల లెక్క‌న బ్యాంకుకు క‌డ‌తాన‌ని కూడా చెప్పాడు. ఇటీవ‌లికాలంలో పెళ్ళి కూతుళ్ళ‌ను, పెళ్ళికొడుకుల‌ను తీసుకొచ్చేందుకు పుట్టిన బిడ్డ‌ల‌ను పుట్టింటికి, మెట్టినింటికి తీసుకెళ్ళేందుకు రాజ‌స్థాన్, బీహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. దీంతో ఈ రైతు కూడా భూమి త‌న‌ఖా పెట్టి హెలికాఫ్ట‌ర్ కోసం లోన్‌కి ద‌ర‌కాస్తు చేసుకున్నాడు. కైలాస్ ప‌తంగి అప్లికేష‌న్ చూసిన మేనేజ‌క్ ఖంగుతిన్నాడు. ఆ యువ‌రైతు వ‌య‌సు 22 ఏళ్ళు. కాగా ఈ రైతు చేసుకున్న లోన్ అప్లికేష‌న్ వ్య‌వ‌హారం వైర‌ల్ అయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..